మార్కాపురం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సైదా రోడ్ షో
మార్కాపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షేక్ సైదా గురువారం నాడు రోడ్ షో నిర్వహించారు.
పట్టణంలోని స్థానిక మార్కాపురం అడ్డరోడ్డు వద్దనుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాదయాత్రగా బయలుదేరి విశ్వనాథపురం, పెద్దబస్టాండ్ మీదుగా చిన్నబస్టాండ్ సెంటర్ వరకు రోడ్ షో నిర్వహించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.