పోతవరం గ్రామంలో తెదేపా కండువా కప్పుకున్న 40కుటుంబాలు
పొదిలి మండలం పోతవరం గ్రామంలోని 40కుటుంబాలు వైసీపీని వీడి తెదేపాలో చేరారు.
బత్తిన పిచ్చయ్య కుమారుడు బత్తిన శ్రీను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరగా ఆయనతో పాటుగా 40కుటుంబాలు తెదేపాలో చేరాయి.
తెదేపాలో చేరిన కుటుంబాలకు మార్కాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి సోదరుడు కందుల రామిరెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఏరువా భూపాల్ రెడ్డి, తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.