తెదేపా అభ్యర్థులను గెలిపించాలని కోరిన షహనాజ్
పట్టణంలోని స్థానిక 3వ వార్డులో తెలుగు మహిళా జిల్లా కార్యదర్శి షేక్ షహనాజ్ ప్రచారం నిర్వహించారు.
ఎన్నికలు సమీపిస్తుండగా తమ కార్యకర్తలతో ఆదివారంనాడు పట్టణంలోని 3వ వార్డులో ప్రచారం నిర్వహించి తమ పార్టీ అభ్యర్థులైన మార్కాపురం నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి కందుల నారాయణరెడ్డి అలాగే ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి సిద్దా రాఘవరావును భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు షేక్ గౌస్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.