పట్టణంలో రోజురోజుకు తీవ్ర నీటి ఎద్దడి….
పట్టణంలో రోజురోజుకు నీటిసమస్య పెరిగిపోతోంది. ఎన్నికలు ముగిసిన 3రోజుల్లోనే దాదాపుగా 400కు పైగా బోర్లు ఎండిపోయాయి అంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
అసలే ఎండాకాలం రోజుకు రెండు పూటలా స్నానం చేయనిదే ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితి ఉండదు. అలాంటిది వారంలో 3సార్లు మాత్రమే స్నానం చేసే పరిస్థితి ఏర్పడింది. తాగడానికి కూడా నీరు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.
తక్షణమే చర్యలు తీసుకుని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటిని సరఫరా చేసి ప్రజలను ఈ నీటి కష్టాలనుండి బయటపడేలా చూడాలని పట్టణ ప్రజలు అధికారులను కోరుతున్నారు.