ముగ్గురు దొంగలు అరెస్టు
తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలకు పాల్పడే ముగ్గురు దొంగలను అరెస్టు చేసినట్లు పొదిలి ఎస్ఐ శ్రీరామ్ తెలిపారు.
వివరాల్లోకి వెళితే పొదిలి పోలీసు స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పొదిలి ఎస్ఐ శ్రీరామ్ మాట్లాడుతూ ఏప్రిల్ 2వతేదీన పోతవరం గ్రామంలో ఇంటి తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించి బీరువాలోని 50,000నగదు మరియు బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్ళిన కేసు దర్యాప్తులో భాగంగా పక్కా సమాచారంతో స్థానిక ఎస్ వి కే పి డిగ్రీ కళాశాల వద్ద రెక్కీ నిర్వహించి మంచాల గాంధీ, చెంచేటి వెంకటరాజు, గంజి లక్ష్మయ్య అనే ముగ్గురు దొంగలను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారని తెలిపారు.
అలాగే అద్దంకి, దర్శి ప్రాంతాలలో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతూ మరోసారి పొదిలిలో దొంగతనం చేసేందుకు వస్తుండగా తన సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకుని….. వారి వద్దనుండి ఒక బైకు, 3ఇనుపరాడ్లు, ఒక జత చెవి దిద్దులు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.