ఆల్ ఇండియా సైన్స్&మాథ్స్ టాలెంట్ టెస్టులో పొదిలి విద్యార్థిని 4వ ర్యాంకు
సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్ న్యూఢిల్లీ సంస్థ నిర్వహించిన ఆల్ ఇండియా సైన్స్&మాథ్స్ టాలెంట్ టెస్టులో పొదిలిలోని నిర్మలా కాన్వెంట్ నందు 6వ తరగతి చదువుతున్న ఎస్ అమూల్య అనే విద్యార్థిని 4వ ర్యాంకు సాధించింది. ఈ సందర్భంగా అల్ ఇండియా స్థాయిలో విద్యార్థిని కనపరచిన ప్రతిభను పాఠశాల సిబ్బంది అభినందించారు.