పొదిలి పోలీసు స్టేషన్ ను ప్రకాశంజిల్లా ఎస్పీ సిద్ధార్ద్ కౌశల్ తనిఖీ

సాధారణ ఎన్నికల సమయంలో నూతనంగా భాద్యతలు స్వీకరించిన ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ జిల్లాలో ఎన్నికల నిర్వహణ అనంతరం సోమవారంనాడు జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో తనిఖీలు నిర్వహించి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా పొదిలి పోలీసు స్టేషన్ కు విచ్చేసిన ఎస్పీ కౌశల్ మండలంలోని పరిస్థితులను ఆరా తీశారు.

అసాంఘిక కార్యకలాపాలు, ఎన్నికలు, క్రికెట్లపై బెట్టింగులకు సంబంధించి సమాచారం ఏమైనా ఉంటే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని…… ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.

అనంతరం పొదిలిలో ట్రాఫిక్ సమస్యను ఆయన దృష్టికి తీసుకుని వెళ్లగా ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేలా త్వరలోనే చర్యలు తీసుకుంటామని అన్నారు.

ప్రతి ఆర్టీసీ బస్టాండులో జేబు దొంగల ఆట కట్టించే విధంగా సిసి కెమెరాలను ఏర్పాటు చేసే విధంగా ఆర్టీసీ ఎండీ దృష్టికి తీసుకుని వెళతామని అలాగే రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలలో నూతన సిసి కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో దర్శి డిఎస్పీ నాగరాజు, పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ చిన్న మీరా సాహెబ్, పొదిలి ఎస్ఐ శ్రీరామ్, కొనకనమిట్ల ఎస్ఐ బాలకృష్ణ, మర్రిపూడి ఎస్ఐ మాధవరావు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.