ముంచుకొస్తున్న ఫణి తుఫాను…. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక
బంగాళాఖాతంలో గురువారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం మధ్యాహ్నానికి వాయుగుండంగా మారిందని….. శుక్రవారంనాడు రాత్రికి వాయుగుండం తుఫానుగా మారే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.
రానున్న తుఫానుకు “ఫణి”గా పేరుపెట్టిన వాతావరణ శాఖ…… ఫణి తుఫాను ప్రభావం తమిళనాడుపై అత్యంత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది.
ఏప్రిల్ 27నుండి 30వరకు ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడులలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రలోని ప్రజలు ,అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. అలాగే మత్యకారులు వేటకు వెళ్ళొద్దని హెచ్చరించింది.