లిటిల్ హార్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం

వేసవికాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు లిటిల్ హార్ట్స్ సొసైటీ వ్యవస్థాపక సభ్యులు వరికూటి శిరీషారమణారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని పలువురు మహిళలు చలివేంద్రాన్ని ప్రారంభించారు.

స్థానిక విజయబ్యాంకు వద్ద ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రం ద్వారా స్థానిక విజయ బ్యాంకు, స్టేట్ బ్యాంకు, సిండికేట్ బ్యాంకు లకు వచ్చే ప్రజలతో ఎప్పుడూ రద్దీగా ఉంటుందని ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేసి నీటిని సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వి నారాయణమ్మ, వి పద్మ, శివ కుమారి, మెట్టు రమణమ్మ, రత్న, రమాదేవి, కాశిరత్నం, ఈశ్వరి, శ్రావణి, మహేశ్వరి, నిర్మల, సుజాత, పుష్ప, రత్నం, తదితరులు పాల్గొన్నారు.