యువకుడు ఆత్మహత్య

పొదిలి మండలం మూగచింతల గ్రామ జాతీయ రహదారి వద్ద గల రెస్టారెంట్ సమీపంలో సిగినం విల్లి ఫ్రాన్సిస్ (37) ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం ఉదయం వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే కర్నాటక రాష్ట్రం హుబ్లీకి చెందిన మృతుడు ఫ్రాన్సిస్ పొదిలి పట్టణంలోని నేతపాలెంకు చెందిన ప్రేమలతతో వివాహం అయింది. నేతపాలెం నందు జీవనం సాగిస్తున్న ఫ్రాన్సిస్ కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పొదిలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.