సిపియం, సిఐటియు ఆధ్వర్యంలో మేడే వేడుకలు
135వ ప్రపంచ కార్మిక దినోత్సవం (మే డే) వేడుకలను సిపియం సిఐటియు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
స్ధానిక పౌర సరఫరాల శాఖ గిడ్డంగి, పంచాయతీ కార్యాలయం, విశ్వనాథపురం మరియు పట్టణంలో ని పలు చోట్ల జెండాలను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో సిపియం నాయకులు ఎం రమేష్, పి ఛార్లెస్, రామయ్య, వి దాసు, జి నాగులు, కెవి నరసింహం, డి సుబ్బయ్య, బి లక్ష్మి నర్సు, వీర నారాయణ, ఎద్దు నగేష్, మౌలాలి, తదితరులు పాల్గొన్నారు.