సిపిఐ, ఎఐటియుసి ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు

ప్రపంచ కార్మికులు దినోత్సవం (మేడే) సందర్భంగా పొదిలి పట్టణం నందు భారత కమ్యూనిస్టుపార్టీ మరియు ఎఐటియుసి ఆధ్వర్యంలో లెనిన్ భవన్ నందు జెండా ఆవిష్కరించి మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం స్థానిక పెద్ద బస్టాండు సెంటర్ నందు గల కమ్యూనిస్టు పార్టీ నాయకులు కాశిరెడ్డి స్మారక స్థూపం వద్దకు చేరుకున్నారు…

ఈ సందర్భంగా ఎఐటియుసి జిల్లా కార్యదర్శి గుజ్జుల బాలిరెడ్డి మాట్లాడుతూ కార్మికవర్గం సాధించిన హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎఐటియుసి నాయకులు దేవదానం, నారాయణ, గౌస్ బాషా, షేక్ జిలానీ, అల్లాబాషా, మోహన్, ప్రసాద్, కోటేశ్వరరావు, కమలమ్మ, జ్యోతి, సామ్రాజ్యం, తదితరులు పాల్గొన్నారు.