డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇద్దరికి జైలుశిక్ష

మద్యం సేవించి వాహనాలు నడిపిన ఇద్దరికి పొదిలి కోర్టు జైలుశిక్ష విధించినట్లు పొదిలి ఎస్ఐ శ్రీరామ్ ఒక ప్రకటనలో తెలిపారు.

వివరాల్లోకి వెళితే పొదిలి పోలీసులు చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఇద్దరిని బుధవారంనాడు పొదిలి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఎదుట హాజరు పరచగా ఇరసలాగుండానికి చెందిన పగడాల శ్రీనుకు 75రోజులు, నందిపాలెం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లుకు 2రోజుల జైలుశిక్ష విధించగా…. పగడాల శ్రీనుకు ఒంగోలు జిల్లా జైలుకు, వెంకటేశ్వర్లును దర్శి సబ్ జైలుకు తరలించినట్లు ఎస్ఐ శ్రీరామ్ ప్రకటనలో పేర్కొన్నారు.