తీరం దాటిన ఫణి ఒరిస్సాలో భారీగా ఆస్తినష్టం
ఉత్తరాంధ్ర ప్రజలను భయబ్రాంతులకు గురి చేసిన “ఫణి” తుఫాను ఎట్టకేలకు ఒరిస్సా రాష్ట్రంలోని పూరి సమీపంలో తీరం దాటింది.
ఈ రెండు రోజులు ఉత్తరాంధ్ర, దక్షిణ ఒరిస్సాలోని ప్రజలు ఫణి తుఫాను ఎటువంటి నష్టం కలిగిస్తుంది అనే అనుమానంతో బిక్కుబిక్కుమంటూ ఉండగా అధికారులు తీసుకున్న ముందస్తు జాగ్రత్తలతో ఎటువంటి ప్రాణనష్టం కలగకుండా నివారించగలిగారు అధికారులు.
అయితే శ్రీకాకుళం జిల్లా మరియు జిల్లా పరిసరాల్లో కొంతమేర ఆస్తినష్టం జరిగినా ఫణి ప్రభావం అనుకున్నంత లేకపోవడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. కాగా తుఫాను ప్రభావం తీవ్రంగా ఉన్న ఒరిస్సాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఒరిస్సాలోని అధికారుల అప్రమత్తతో ప్రాణనష్టం జరగకుండా నివారించారు కానీ ఆస్తినష్టం మాత్రం భారీగానే జరిగింది.
భువనేశ్వర్ లోని బీజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం సగానికిపైగా ఈ ఫణి తుఫాను ధాటికి ధ్వంసం అయింది. అయితే ప్రస్తుతం అటు ఒరిస్సా, ఇటు ఆంధ్రా అధికారులు జరిగిన నష్టాన్ని అంచనా వేసే పనిలో నిమగ్నమయ్యారు.