బోరు బండి దగ్ధం 10లక్షల అస్థి నష్టం
బోరు బండి దగ్ధం కావడంతో 10లక్షల విలువనై అస్థి నష్టం జరిగిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే పొదిలి మండలంలోని రాములవీడు గ్రామంలోని పొలాలలో బోరు వేసే నిమిత్తం బోరుబండి పిలిపించి బోర్ వెస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి బోర్ బండికి మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సకాలంలో వచ్చిన అగ్నిమాపక వాహనం తగలబడుతున్న బోరుబండిని అర్పివేశారు.
అగ్నిమాపక కేంద్ర అధికారులు మాట్లాడుతూ సమారు 70లక్షల విలువ చేసే బోరుబండి తెలంగాణ రాష్ట్రంలోని హయత్ నగర్ కు చెందిన మోహన్ రెడ్డి చెందినదని సుమారు 10లక్షల విలవైన అస్థి నష్టం జరిగిందని తెలియజేశారు