ద్విచక్ర వాహనాల ఢీ ఇద్దరికి గాయాలు
రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు గాయపడిన సంఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే పొదిలి మండలం కాటూరిపాలెం సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని మర్రిపూడి మండలం కెల్లంపల్లి గ్రామానికి చెందిన దుగ్గినేని శ్రీకాంత్…. పొదిలి పట్టణానికి చెందిన శ్రీనివాస్ అనే ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు. శ్రీనివాస్ కు కాలికి తీవ్ర గాయమవ్వగా సంఘటన స్ధలం నుండే ఒంగోలుకు తరలించారు. దుగ్గినేని శ్రీకాంత్ ను 108వాహనంలో పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.