బూచేపల్లి సుబ్బారెడ్డికి సంతాపం తెలిపిన వైసీపీ నాయకులు తూము బాలిరెడ్డి…
దర్శి మాజీ శాసనసభ్యులు బూచేపల్లి సుబ్బారెడ్డి మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ వైసీపీ నాయకులు తూము బాలిరెడ్డి తన నివాసగృహం వద్ద బూచేపల్లి సుబ్బారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో బాలిరెడ్డి మాట్లాడుతూ బూచేపల్లి సుబ్బారెడ్డితో తనకు 1961లో చదువుకునే రోజుల నుండే పరిచయం ఉందని చదువుల అనంతరం కాంగ్రెస్ పార్టీలో కలిసి పని చేశామని….. ఎంతో ఆప్యాయతఅనురాగలతో కలిసి మెలిసి ఉండేవాళ్ళమని 2004లో దర్శి శాసనసభ స్థానానికి పోటీ చేసినప్పటికి శాసనసభ్యుడననే గర్వం లేకుండా స్నేహాన్ని మరవలేదని భావోద్వేగాలతో వాఖ్యానించారు. వారి కుటుంబానికి ప్రఘాడ సానుభూతిని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గుద్దేటి శ్రీనువాసులు శ్రీనువాసులురెడ్డి వాల్మీకి సాయి తదితరులు పాల్గొన్నారు