గుప్త నిధుల కోసం వెళ్లి ఇద్దరి ఆచూకీ గల్లంతు…. ఒక మృతదేహం లభ్యం మరో వ్యక్తికోసం తీవ్ర గాలింపు

తర్లుబాడు మండలం తాడివారిపల్లి గ్రామ సమీపంలోని ఒంగోలు-నంద్యాల రహదారి అటవీప్రాంతంలో వెలుగొండ వేంకటేశ్వరస్వామి స్వామి పాదాల కొండల్లో గుప్తనిధులు కోసం ముగ్గురు వ్యక్తులు అడవిలోకి ప్రవేశించారు.

ముగ్గురు వ్యక్తులు కలిసి సోమవారంనాడు గుప్తనిధులను వెతుక్కుంటూ తాడివారిపల్లి అటవీప్రాంతంలోకి ప్రవేశించిన అనంతరం బుధవారంనాడు రాత్రి గుంటూరు జిల్లా కొల్లిపరకు చెందిన కృష్ణ నాయక్ చావు బ్రతుకుల మధ్య బయటికి వచ్చి….. తనతో వచ్చిన కెనరా బ్యాంకు ఉద్యోగి కట్టా శివకుమార్ కుమారుడికి ఫోన్ చేసి అడవిలోకి ముగ్గురం వెళ్లామని అక్కడ ఏమి చేయాలి ఎక్కడ తవ్వాలి అనే విషయం ఆర్ధంకాక తిరుగు ప్రయాణమయ్యామని…..

అలా వస్తూ ఉండగా నడవలేక ఎండ తీవ్రతకు దాహంతో అల్లాడి పోయామని…. నేను అతి కష్టంగా బయటకు వచ్చానని తెలపడంతో శివకుమార్ కుమారుడు తన వద్దకు వచ్చిన అనంతరం కృష్ణనాయక్ కట్ట శివకుమార్ కుమారుడు కలిసి తర్లుబాడు పోలీస్ స్టేషన్ లో విషయం తెలియజేయగా గురువారం ఉదయం పొదిలి సిఐ చిన్న మీరా సాహెబ్, పొదిలి యస్ఐ శ్రీరామ్, మర్రిపూడి యస్ఐ మాధవరావు, దొనకొండ యస్ఐ రమేష్, సారథ్యంలో 30మంది సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టి బ్యాంకు ఉద్యోగి అయిన కట్టా శివకుమార్ (45) మృతదేహాన్ని గుర్తించారు.

కాగా మరో వ్యక్తి కోసం తీవ్రంగా గాలిస్తుండగా ఇప్పటికీ అచుకి లభ్యం కాకపోవడం మరియు చీకటి పడడంతో గాలింపు అంతరయం ఏర్పడింది. హైదరాబాదులోని కెనరా బ్యాంకు ఉద్యోగి కట్టా శివకుమార్ మృతి చెందగా… గుంటూరుకు జిల్లాకు చెందిన ఇద్దరిలో కృష్ణానాయక్ సురక్షితంగా బయటపడ్డాడు… కాగా బోడు హనుమంతు ఆచూకీ లభ్యం కావలసి ఉంది.