చలివేంద్రం ప్రారంభించిన యస్ఐ శ్రీరాం
పొదిలి పెద్ద బస్టాండ్ నందు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని పొదిలి యస్ఐ శ్రీరాం ప్రారంభించారు. వివరాలు లోకి వెళితే బుధవారం నాడు స్థానిక పెద్ద బస్టాండ్ నందు గునుపూడి భాస్కర్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన యస్ఐ శ్రీరాం ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవి కాలంలో ఇలాంటి చలివేంద్రలను ఏర్పాటు చేసి ప్రజల దాహంన్ని తీర్చే విధంగా కృషి చేసిన నిర్వహకులకు అభినందించారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి రామ్ మోహన్ తెదేపా నాయకులు కాటూరి వెంకట నారయణ బాబు కాటూరి వెంకట ప్రతాప్ ముల్లా షరీఫ్ ఎండి గౌస్ శిద్దా సుధాకర్ గునుపూడి మదుసూదన్ రావు షేక్ జిలానీ యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి ఉదయ్ శంకర్ యాదవ్ తనికొండ వెంకట్రావు మేడా ప్రతాప్ తెలుగు మహిళ నాయకరాలు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు