అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు : ఎస్ఐ శ్రీరామ్

ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం గురువారంనాడు అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో పొదిలి మండలంలో 144సెక్షన్, 30పోలీసు యాక్ట్ అమలులో ఉన్నందున ప్రజలు నలుగురు అంతకు మించి గుమిగూడి ఉండరాదని…. అలాగే శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పొదిలి ఎస్ఐ శ్రీరామ్ తెలిపారు.

అలాగే అనుమతులు లేకుండా బాణాసంచాలు కాల్చడం, విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం నిషేధించడం జరిగిందని అటువంటి చర్యలకు పాల్పడవద్దని…. ఎవరినైనా కించపరిచే విధంగా మాట్లాడడం వంటివి చేయవద్దని ఎస్ఐ శ్రీరామ్ హెచ్చరించారు.