రైల్వే లైన్ లో భూముల కోల్పోతున్న రైతులకు యకరాకు 30 లక్షలు చెల్లించాలి : టిడిపి సిపియం వైసీపీ లు డిమాండ్
నడికుడి-శ్రీకాళహస్థి రైల్వేలైన్ లో భూములు కోల్పొతున్న రైతులకు యకరా నికి 30లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని పట్టాభూములతో సమానంగా అసైన్ మెంట్ భూములకు పరిహారంఇవ్వాలని మరియు తోపు వాగు పోరంబోకు భూముల సాగు చేసుకొనే రైతులకు కూడా నష్టం పరిహారం చెల్లించాలని అదికారులనుటిడిపి నాయకులు కాటూరి నారాయణ ప్రతప్ తనికొండ వెంకట్రావు సిపియం నాయకులు ఎం రమేష్ గంధం నరసింహరావు వైసీపీ నాయకులు పల్లెర్ల అంజీరెడ్డి మరియు రైతులు తదితరులు అధికారులకు వినతి పత్రం అందజేశారు.