రేపుటి నుండి కౌలు రైతు గుర్తింపు గ్రామసభలు

కౌలు రైతు గుర్తింపు కార్డులు మంజూరుకై మంగళవారం నుండి నిర్వహించే గ్రామ సభలను కౌలురైతులు వినియోగించుకోవాలని పొదిలి తహశీల్దార్ హామీద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

29వ తేది నుండి జూన్ 7వ తేది వరకు రెవిన్యూ గ్రామాల వారీగా గ్రామసభలు నిర్వహస్తున్నామని ఈ సభలో డిప్యూటీ తహశీల్దార్ జానీ బేగ్, రెవిన్యూ అధికారులు, గ్రామ రెవిన్యూ అధికారులు, సహాయకులు, తదితరులు పాల్గొంటారని కావున కౌలు రైతులు ఈ అవకాశం వినియోగించుకుని కౌలు రైతు గుర్తింపు కార్డులు పొందాలని అన్నారు.