పంచాయతీ ఓటర్లు తుది జాబితా 18న విడుదల
పొదిలి గ్రామ పంచాయతీకి సంబంధించిన ఓటర్లు తుది జాబితా 18వ తేదిన విడుదల చేస్తామని పొదిలి మండల అభివృద్ధి అధికారి ఫణి కుమార్ నాయక్ అన్నారు.
వివరాల్లోకి వెళితే శుక్రవారంనాడు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆయనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ దాదాపుగా పూర్తి అయిందని పోలింగ్ బూత్ లను పర్యవేక్షించి మౌలిక వసతులు సక్రమంగా ఉన్నాయా లేదా అనే పరిశీలన కూడా పూర్తయిందని…… ప్రభుత్వం రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోవడమే తరువాయి ఆని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల పంచాయతి రాజ్ విస్తరణ అధికారి రంగ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.