జిల్లా పరిషత్ మరియు మండల పరిషత్ ఎన్నికలకు రంగం సిద్ధం….
జిల్లా పరిషత్ మరియు మండల పరిషత్ ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తూ ఆ దిశగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీచేసింది.
వివరాల్లోకి వెళితే జిల్లా ప్రాదేశిక మరియు మండల ప్రాదేశిక నియోజకవర్గాల వారిగా ఓటర్ లిస్ట్ సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్ రమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు…… గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం సిద్ధం చేసిన ఓటర్ లిస్టును జిల్లా మండల ప్రాదేశిక నియోజకవర్గాల వారిగా జూలై 3వ తేదిలోగా తయారు చేసి సిద్ధంగా ఉంచాలని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలతో పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే జిల్లా మరియు మండల పరిషత్తుకు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధంగా ఉందని సమాచారం.