బాధ్యతలు స్వీకరించిన నూతన సిఐ శ్రీరామ్
పొదిలి సర్కిల్ నూతన ఇన్స్పెక్టర్ గా నియమితులైన వి. శ్రీరామ్ శనివారంనాడు బాధ్యతలు స్వీకరించారు.
గిద్దలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనను శుక్రవారంనాడు పొదిలికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా శనివారంనాడు ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న షేక్ చిన్న మీరా సాహెబ్ గుంటూరు రేంజ్ ఆఫీసుకు బదిలీ అయ్యారు.