24వ తేది నుండి గ్రామ వాలంటీర్ దరఖాస్తుల స్వీకరణ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ వాలంటీర్ పోస్టుల భర్తీకై శనివారం జిఓ జారీ చేసింది.
వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ చొప్పున ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజల వద్దకు చేర్చే విధంగా ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేస్తూ
జిఓ విడుదల చేసింది.
గ్రామ వాలంటీర్ కు విద్యార్హతలు చూస్తే గ్రామీణ ప్రాంతంలో ఇంటర్….. మున్సిపాలిటీలో డిగ్రీ కలిగి ఉండవలెను. తేది 30.06.2019 నాటికీ 18 నుండి 35 సంవత్సరాల వయసు నిండిఉండి దరఖాస్తుదారుడు అదే పంచాయతీ నివాసి అయి ఉండాలి. యస్సీ, యస్టీ, బిసిలకు చెందిన వారు కుల ధ్రువీకరణ పత్రాలు జతపరచి ఆధార్ కార్డుతో తేది 24.06.2019 నుండి 05.07.2019 వరకు gramavoluteer.ap.gov.in అన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.