ఉచిత కేరళీయ ఆయుర్వేద వైద్యశిబిరానికి విశేష స్పందన….
లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్ ఆధ్వర్యంలో కేరళీయ ఆయుర్వేద హాస్పిటల్ ఒంగోలు వారు నిర్వహించిన ఉచిత ఆయుర్వేద వైద్యశిబిరానికి ప్రజలలో విశేష స్పందన లభించింది.
వివరాల్లోకి వెళితే స్థానిక పెద్దబస్టాండులోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్ ఏర్పాటు చేసిన కేరళీయ ఆయుర్వేద హాస్పిటల్ డాక్టర్లు డా” అనిబ్ ఏపి మరియు డా” ఆతిర కోడెరి లు 204మంది రోగులకు వైద్యపరీక్షలు నిర్వహించారు.
ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్ అధ్యక్షులు లయన్ సత్యన్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు కూడా ఆయుర్వేద వైద్యం అందించాలనే సంకల్పంతో పొదిలిలో మొదటిసారిగా కేరళీయ ఆయుర్వేద వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని….. ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించిన స్థానిక ప్రముఖ న్యాయవాది శ్రీపతి శ్రీనివాసరావు, ఆర్ఎంపి డాక్టర్ లక్ష్మీనారాయణ….. కేరళీయ ఆయుర్వేద హాస్పిటల్ డాక్టర్లకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
లయన్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్ సీనియర్ సభ్యులు మాంటిస్సోరి ప్రకాష్ మాట్లాడుతూ ఏర్పాటు చేసిన మొదటిసారి అయినా కూడా ప్రజలు ఆయుర్వేద వైద్యాన్ని విశేషంగా ఆదరిస్తున్నారని….. ఇలానే ప్రతి నెల నాలుగవ ఆదివారం ఉచిత ఆయుర్వేద వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు.
కేరళీయ ఆయుర్వేద హాస్పిటల్ డైరెక్టర్ శబరినాధ్ నాయర్ మాట్లాడుతూ మున్ముందు ప్రజలకు ఆయుర్వేద వైద్యంలో ఇంకా మెరుగైన సేవలను అందించేందుకు ప్రతినెలా నాలుగవ ఆదివారం ఆర్ఎంపి లక్ష్మీనారాయణ చికిత్స కేంద్రం నందు వైద్యపరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో లయన్ క్లబ్ ఒంగోలు సిటిజన్స్ సభ్యులు రాఘవ, సిచి మైఖేల్, సోమినేని సునొబెల్, తదితరులు పాల్గొన్నారు.