నీటి సమస్య పరిష్కారానికే నా తొలి ప్రాధాన్యత : ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి
నీటి సమస్య పరిష్కారానికే నా తొలి ప్రాధాన్యత అని మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి అన్నారు.
వివరాల్లోకి వెళితే సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన
శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 33 కోట్లతో పెద్ద చెరువుకు సాగర్ నీటిని తీసుకురావడం కోసం అనుమతులు మంజూరు అయ్యాయని…. కారణాలు ఏమైనప్పటికి పని పూర్తి చేయడం జరగలేదని అన్నారు.
నూతన వైసీపీ ప్రభుత్వ హయాంలో తక్షణమే పనులు ప్రారంభం చేసే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి విన్నమించి పనులకు టెండర్లు పిలిచి త్వరితగతిన పనులు ప్రారంభం అయ్యే విధంగా కృషి చేస్తానని…… అదేవిధంగా నవరత్నాలు అమలు జరిగే విధంగా కృషి చేస్తానని ఆయన తెలిపారు.
మండల పరిషత్ కార్యవర్గానికి ఇదే చివరి సమావేశం కావడం…. అలాగే నాకు తొలి సమావేశం అయిందని…… ప్రస్తుత సభ్యులు ప్రజాక్షేత్రంలో పోటీచేసి ప్రజా ప్రతినిధులుగా మరలా అడుగు పెట్టలాని ఆకాంక్షించారు.
మండల పరిషత్ అధ్యక్షులు కె నరసింహరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జడ్పీటిసి సాయి రాజేశ్వరరావు, ఎంపిడిఓ ఫణి కుమార్ నాయక్, మండల పరిషత్, ఎంపిటిసి సభ్యులు, మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.