డీప్ బోరుకై ఎమ్మెల్యేకు వినతిపత్రాన్ని అందజేసిన మాజీ పంచాయతీ సభ్యులు ముల్లా బాషా
డీప్ బోరుకై అందజేసిన మాజీ పంచాయతీ 7వ వార్డు సభ్యులు ముల్లా బాషా తన వార్డులోని మహిళలతో కలిసి మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు.
వివరాల్లోకి వెళితే పొదిలి మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డిని పొదిలి పంచాయతీ 7వ వార్డు మాజీ సభ్యులు ముల్లా బాషా తన వార్డులోని మహిళలతో కలిసి తమ వార్డులో ఏర్పాటు చేసిన డీప్ బోరులోని నీరు అడుగంటి పోవడంతో నీరు రావట్లేదని తమ గోడును వెళ్లబోసుకుని వినతిపత్రాన్ని అందజేయగా…… శాసనసభ్యులు తక్షణమే స్పందిస్తూ వార్డులో నూతన డీప్ బోరును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ముల్లా బాషా మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించడంలో అలసత్వం వహించకుండా తక్షణమే సమస్య పరిష్కారంలో స్పందించడంపై హర్షం వ్యక్తం చేశారు.