బోలరో బోల్తా ముగ్గురికి గాయాలు
బోలరో వాహనం బోల్తాపడి ముగ్గురు గాయపడిన సంఘటన బుధవారంనాడు ఉదయం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే పోరుమావిళ్ళ నుంచి అమరావతి వెళ్తున్న కడప జిల్లా పోరుమావిళ్ల తహశీల్దార్ కు చెందిన బొలెరో వాహనం స్థానిక దరిశి రోడ్డులోని యస్ యస్ కె అపార్ట్మెంట్ వద్ద బోల్తాపడడంతో అందులో ప్రయాణిస్తున్న గోకవరం చంద్రశేఖర్, షేక్ మోహిద్దీన్ మరియు డ్రైవర్ కు స్వల్పగాయలయ్యాయి. గాయపడిన వారిని 108వాహనంలో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రధమచికిత్స అనంతరం వేరొక వాహనంలో స్వగ్రామానికి వెళ్లినట్టు సమాచారం.
స్పీడ్ బ్రేకర్ కు సంబంధించిన సూచిక బోర్డు లేకపోవడం అలాగే స్పీడ్ బ్రేకర్ కనిపించకపోవడంతో డ్రైవర్ వాహన వేగాన్ని అదుపు చేయలేక ప్రమాదం సంభవించిందని…… రవాణాశాఖ అధికారులు స్పందించి సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.