ఎడమ చేతికి గాయం….. కానీ కుడి చేతికి వైద్యంచేసిన వైద్యుడు
వివరాల్లోకి వెళితే బీహార్ రాష్ట్రం ద్రాబంగ్ పట్టణంలో మామిడి చెట్టు నుంచి బాలుడు కిందపడడంతో ఎడమచేయి విరిగింది. అయితే సదరు బాలుడు వైద్యశాలకు వెళ్ళగా వైద్యుడు ఎడమచేతికి బదులుగా కుడిచేతికి కట్టును కట్టారు.
అయితే ఈ సంఘటనపై బాలుడు మాట్లాడుతూ “వారు నాకు చికిత్స ఇస్తున్నప్పుడు నేను వారికి చెప్పడానికి ప్రయత్నించాను, కాని వారు నా మాట వినలేదు మరియు కట్టును కుడిచేతికి” కట్టారు చెప్పడు ఏడేళ్ల ఫైజన్.
ఫైజాన్ తల్లి మాట్లాడుతూ దీనిని “పూర్తిగా వైద్యుల నిర్లక్ష్యం”గా తెలిపింది. ఈ ఘటనపై “దర్యాప్తు జరపాలి. మాకు ఆసుపత్రి ఒక్క టాబ్లెట్ కూడా ఇవ్వలేదు” అని చెప్పారు.
ఈ కేసు రాష్ట్ర ఆరోగ్య శాఖకు చేరగా మంత్రి మంగల్ పాండే వైద్యకేంద్ర సూపరింటెండెంట్‌ను ఘటనపై వివరణ కోరారు.
ఘటనపై డాక్టర్ రాజ్ రంజన్ ప్రసాద్ మాట్లాడుతూ”ఈ నిర్లక్ష్యానికి సంబంధించి ఈ విషయంపై దర్యాప్తు చేసి సంబంధిత బృందం నుండి వివరణ ఇవ్వాలని ఆరోగ్య మంత్రి నన్ను ఆదేశించారు. ఈ సంఘటనను నేను ఖండించడమే కాకుండా మరియు సమస్యను పరిష్కరానికి కృషి చేస్తానని అన్నారు.
ఈ సంఘటనలో పాల్గొన్నవారికి శిక్ష పడుతుందని డాక్టర్ రాజ్ రంజన్ ప్రసాద్ అన్నారు. వైద్య కేంద్రం సూపరింటెండెంట్.