పొదిలి, మర్రిపూడి ఎస్ఐ లకు స్థానచలనం కలిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
వివరాల్లోకి వెళితే పొదిలి పోలీస్ స్టేషన్ కు నూతన ఎస్ఐ గా ప్రస్తుతం రాచర్ల పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న కె.సురేష్ ను పొదిలి ఎస్ఐ గా బదిలీ చేసి….. ప్రస్తుతం పొదిలి ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న టి శ్రీరామ్ ను కందుకూరు రూరల్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు.
అలాగే మర్రిపూడి పోలీస్ స్టేషన్ కు నూతన ఎస్ఐ గా జిల్లా క్రైం రికార్డ్స్ బ్యూరో నందు విధులు నిర్వహిస్తున్న ఆరాధ్యుల సుబ్బరాజును మర్రిపూడి ఎస్ఐ గా బదిలీ చేసి…… ప్రస్తుతం మర్రిపూడి ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న కె మాధవరావును కంభం పోలీసు స్టేషన్ కు బదిలీ చేశారు.