ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన హార్టికల్చర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఆరిజ్ అహమ్మద్ ఐఏఎస్….
పొదిలి ప్రభుత్వ ఆసుపత్రిని గురువారంనాడు హార్టికల్చర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మహమ్మద్ ఆరిజ్ అహమ్మద్ ఐఏఎస్ సందర్శించారు.
వివరాల్లోకి వెళితే ఐఏఎస్ డాక్టర్ మహమ్మద్ ఆరిజ్ అహమ్మద్ తన స్వస్థలమైన పొదిలికి విచ్చేసిన సందర్భంగా పొదిలి ప్రభుత్వఆసుపత్రిని తన కుటుంబసభ్యులతో కలిసి సందర్శించి రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలోకంటే ప్రస్తుతం ప్రభుత్వ వైద్యశాల ఎంతో పరిశుభ్రంగా ఉందని…. డాక్టర్లు, సిబ్బంది కూడా రోగులకు మంచి వైద్యసేవలను అందిస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు తహసీన్, అఖిబ్ అహమ్మద్, ప్రభుత్వ ఆసుపత్రి చైర్మన్ జిలాని, డాక్టర్ చక్రవర్తి, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.