వనం-మనం కార్యక్రమంలో మొక్కలు నాటిన ఎస్ఐ సురేష్…..
వనం-మనం కార్యక్రమంలో భాగంగా పొదిలి ఎస్ఐ సురేష్ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు.
వివరాల్లోకి వెళితే స్థానిక శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన వనం-మనం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్ఐ సురేష్ విద్యార్థులతో కలిసి కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు.
అనంతరం ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ నేటి ఆధునిక కాలంలో పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించాలంటే మొక్కలు పెంచడం ఒక్కటే మార్గమని పౌరులు విధిగా మొక్కల పెంపకాన్ని ప్రజలకు తెలియజేసి ప్రతి ఒక్కరు మొక్కల సంరక్షణ చేపట్టాలని కోరారు….. అలాగే ప్లాస్టిక్ వాడకం వల్ల అనర్థాలను గురించి వివరించి ప్లాస్టిక్ వేస్ట్ గా పడవేయడం అవి భూమిలో కలవడం జరగదని దానివలన పర్యావరణం దెబ్బతింటుందని ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ వాడకాన్ని వీడి పాలిథిన్ వాడేలా అవగాహన కల్పించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.