రిటైర్డ్ తహశీల్దార్ షరీఫ్ అనారోగ్యంతో మృతి…..
రిటైర్డ్ తహశీల్దార్ నాగూర్ షరీఫ్ అనారోగ్యంతో శుక్రవారంనాడు మృతిచెందారు.
వివరాల్లోకి వెళితే పొదిలిలోని స్థానిక ఎన్జీవో కాలనీలో నివాసం ఉంటున్న నాగూర్ షరీఫ్ గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఒంగోలులో చికిత్స పొందుతున్నారు….. కాగా అనారోగ్య సమస్యతో మంగళవారంనాడు ఒంగోలులోని సంఘమిత్ర ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ శుక్రవారంనాడు తుదిశ్వాస విడిచారు.
రెవిన్యూ మండల తహశీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా మొదలైన ఆయన ఉద్యోగరీత్యా జిల్లాలో పలుచోట్ల సేవలను అందించి అంచెలంచెలుగా ఎదిగి తహశీల్దార్ స్థాయికి చేరుకుని గిద్దలూరు తహశీల్దార్ గా పనిచేస్తూ పదవీవిరమణ చేశారు.
విషయం తెలుసుకున్న రెవిన్యూ ఉద్యోగులు, బంధుమిత్రులు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ…. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.