గ్రామ గ్రామానా వైయస్ఆర్ జయంతి వేడుకలు….
మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి 70వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారంనాడు స్థానిక మార్కాపురం అడ్డురోడ్డు, విశ్వనాథపురం సెంటర్, పెద్ద బస్టాండ్, చిన్న బస్టాండ్ మరియు కాటూరివారి పాలె నందు గల వైయస్ విగ్రహాలకు మాజీ శాసనసభ్యులు ఉడుముల శ్రీనువాసులరెడ్డి, సానికొమ్ము పిచ్చిరెడ్డిల నాయకత్వంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ వైద్యశాల నందు రోగులకు పండ్లును పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కమిటీ అధ్యక్షులు సంజీవరెడ్డి, వైసీపీ నాయకులు జి శ్రీనివాసులు, కల్లం సుబ్బారెడ్డి, సాయిరాజేశ్వరావు, గుజ్జుల రమణారెడ్డి, నరసింహరావు, గొలమారి చెన్నారెడ్డి, వాకా వెంకటరెడ్డి, హనీమూన్ శ్రీనువాసులరెడ్డి, యక్కలి శేషగిరి, కొత్తూరి శ్రీను, యువజన నాయకులు వర్షం ఫిరోజ్, కోగర వెంకట్రావు యాదవ్, షేక్ గౌస్, మందగిరి రమేష్ యాదవ్, మహిళా నాయకురాలు షేక్ గౌసియా, తదితరులు పాల్గొన్నారు.
స్థానిక 12వ వార్డు నందు పంచాయతీ మాజీ పాలకవర్గ సభ్యురాలు షేక్ నూర్జహాన్ ఆధ్వర్యంలో కేకును కోసి పంచిపెట్టారు. అలాగే రెండవ వార్డులో వర్షం ఫిరోజ్, చాంద్ బాషాల ఆధ్వర్యంలో…… 13వార్డులో మందగిరి రమేష్ యాదవ్, నిహాంత్, జాజుల రవి, పత్తి యోగి,ఆధ్వర్యంలో……. 14వార్డులో వెలుగోలు కాశీ ఆధ్వర్యంలో…… మాదాలవారి పాలెంలో అనికాళ్ళ ఈశ్వర్ రెడ్డి, మీగడ చిన్న ఓబులరెడ్డి, గుంటూరి నాగిరెడ్డి, ఎర్రశ్రీను, దామిరెడ్డి నాసర్ రెడ్డి, కాపులపల్లి శ్రీనువాసులరెడ్డి, వి రమణారెడ్డి తదితరుల ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.