సహకారసంఘాల త్రిసభ్య కమిటీలకు నియామక పత్రాలను అందించిన ఉడుముల
ది ప్రకాశంజిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల గడువు శనివారం ముగియడంతో ఆదివారంనాడు త్రిసభ్య కమిటీని నియమించారు.
పొదిలి సహకార కేంద్ర బ్యాంక్ మరియు కందుకూరు డి ఆర్ పరిధిలో గల సహకార సంఘాలకు సంబంధించిన
నూతన త్రిసభ్య కమిటీలను పొదిలి సహకార కేంద్ర బ్యాంకు నందు మాజీ శాసనసభ్యులు ఉడుముల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార సంఘాలు రైతులకు ఎంతో ఉపయోగపడతాయని రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలోఎస్ డి ఎల్ సి ఓ జి కుమార్, పొదిలి బ్రాంచ్ మేనేజర్ జి ప్రసాద్, సూపర్ వైజర్ మధు, వైసిపి నాయకులు గుజ్జుల సంజీవరెడ్డి, చెన్నారెడ్డి, వాకా వెంకటరెడ్డి, జి శ్రీను, కామసాని వెంకటేశ్వరరెడ్డి, గుజుల రమణారెడ్డి, గోపి, సుబ్బారావు, ప్రాధమిక సంఘ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు .
పి ఏ సి ఎస్ పరిధులలోని సభ్యులు :
మాదాల వారి పాలెం పీ.ఏ సీ.ఎస్ సభ్యులు
1 పొన్నపాటి రాములు, 2 ఎనిక ఏడుకొండలు, 3 ఎద్దు నగేష్,
చిన్నారికట్ల పీ.ఏ సీ.ఎస్ సభ్యులు
1 ఉడుముల కాశీ రెడ్డి, 2 మూలె పెద్ద లక్ష్మి రెడ్డి,
3 గోసుల గోవిందమ్మ,
చిమాట పీ.ఏ సీ.ఎస్ సభ్యులు
1 మాకినేని వెంకట్రావు, 2 అంబటి సింగారెడ్డి,
3 గెట్టబోయిన తిరుపతయ్య,
తర్లుపాడు పీ.ఏ సీ.ఎస్ సభ్యులు
1 తిపిరెడ్డి వెలుగొండారెడ్డి, 2 కలగట్ల కొటేశ్వరమ్మ,
3 కిక్కిరి,
5)మర్రిపూడి పీ.ఏ సీ.ఎస్ సభ్యులు
1 భోగ సముద్రం విజయభాస్కర్ రెడ్డి,
2 మాచేపల్లి సుజాత, 3 మల్లెల వెంకటేశ్వర్లు,
ఉప్పలపాడు పీ.ఏ సీ.ఎస్ సభ్యులు
1 కొండ్రగుంట సుబ్బారావు, 2 గుజ్జుల రమణారెడ్డి,
3 ఉలవా గోపి లు
నియామకపత్రాలను అందుకున్నారు.