ఆపరేషన్ కాశ్మీర్ దిశగా భారత్
ఆపరేషన్ కాశ్మీర్ దిశగా భారత కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతుందని అంటే జరుగుతున్న పరిణామాలు అవును అనే అనిపిస్తుంది.
జమ్మూ కాశ్మీర్ లో ఇప్పటికే లక్ష మంది సైన్యాన్ని తరలించి సైన్యంలో సెలవులు రద్దుచేసి తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేయడంతోపాటు నిన్న పాకిస్థాన్ ప్రేరపిత ఉగ్రవాదులను ముట్టుబెట్టడంతో పాటు అమర్ నాధ్ యాత్ర రద్దు చేసి భక్తులను స్వస్థలాలకు పంపించడం…. అలాగే విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించి విద్యార్థులను వారి స్వరాష్ట్రాలకు ప్రత్యేక రైళ్లు, బస్సులు ద్వారా తరలించారు.
జమ్మూ కాశ్మీర్ పరిస్థితుల గురించి ఆదివారం జాతీయ భద్రత వ్యవహారాల కమిటీ సమావేశమై సమీక్షించడంతో పాటు అనుసరించే హ్యూహంపై చర్చించారు.
ఆదివారం నాడు వేగంగా సమీకరణాలు మారుతూ సరిహద్దుకు యుద్ధ విమానాలు
పెద్ద ఎత్తున యుద్ధ సామాగ్రి తరలిస్తున్నారు. అసలు గత వారం రోజుల నుండి జరగుతున్న పరిణామాల నేపథ్యంలో అసలు కాశ్మీర్ లో ఏం జరగబోతుంది!
అనే విషయం ఇప్పటికి కూడా సృష్టత రాకపోవడంతో దేశ వ్యాప్తంగా కాశ్మీర్ లో ఏం జరగబోతుంది అనేది తీవ్ర చర్చనీయాంశం అవుతుంది.