ప్రారంభమైన గ్రామ వాలంటీర్ల శిక్షణ తరగతులు
మొదటివిడత గ్రామవాలంటీర్ల శిక్షణా తరగతులు మంగళవారంనాడు ప్రారంభం అయ్యాయి.
వివరాల్లోకి వెళితే స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో 19గ్రామ పంచాయతీల పరిధిలో నియమితులైన గ్రామవాలంటీర్లకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ నియామక పత్రాలు అందించారు. అనంతరం వాలంటీర్లకు సంబంధించిన విధివిధానాలతో కూడిన మొదటివిడత శిక్షణా తరగతులు ప్రారంభించారు.