గుడిలో ప్రదక్షిణలు చేసిన వరాహం… ఆశ్చర్యచకితులైన భక్తులు
పట్టణంలోని స్థానిక విశ్వనాథపురంలోని భగవాన్ శ్రీ శ్రీ వెంకయ్యస్వామి దేవస్థానంలో వరాహం ప్రదక్షిణలు చేయడంతో వచ్చిన భక్తులు ఆ వింతను చూసి ఆశ్చర్య చకితులయ్యారు.
వివరాల్లోకి వెళితే మామూలుగా భక్తులు ఆలయాలకు వచ్చిన అనంతరం ముందుగా కాళ్ళు చేతులు కడుక్కుని, ప్రదక్షిణలు చేసి, దైవ దర్శనం చేసుకోవడం ఎల్లప్పుడూ జరుగుతూ ఉంటుంది అయితే ఓ వరాహం నీటి దగ్గరికి వెళ్లి దేహాన్ని శుభ్రం చేసుకుని సుమారుగా 30నిమిషాల పాటు వెంకయ్యస్వామి గుడి చుట్టూ అలాగే హోమగుండం, తులసికోట, ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేసి బయటినుండే స్వామివారి దర్శనం, అన్నపూర్ణాదేవి దర్శనం చేసుకుని ఆలయ ప్రాంగణంలో తిరిగిన సంఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకోవడంతో అందుబాటులో ఉన్న భక్తులద్వారా విషయం తెలుసుకున్న స్థానికులు, గ్రామస్తులు తరలిరాగా అప్పటికే వరాహం అక్కడినుండి వెళ్లిపోవడంతో ఎలా జరిగింది ఏం జరిగింది అనే విషయం మాత్రమే వాకబు చేసి వెనుదిరిగారు.
అయితే పట్టణంలో ఇలాంటి వింత జరగడం ఇదే మొట్టమొదటిసారి కాగా ఈ వింతను చూసే భాగ్యం మాత్రం అక్కడ ఉన్న భక్తులకు మాత్రమే లభించింది.