పొదిలి టైమ్స్ కథనానికి స్పందించిన ఎమ్మెల్యే
స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సంబంధించి పొదిలి టైమ్స్ లో “స్వచ్ఛతకు ఆమడ దూరంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల” అనే కథనంపై మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి స్పందించారు.
బుధవారంనాడు పొదిలికి విచ్చేసిన ఆయన పొదిలి టైమ్స్ లో వచ్చిన కథనం ప్రకారం పాఠశాలను తనిఖీ చేసి ఉపాధ్యాయులను, విద్యార్థులను పాఠశాల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పారిశుద్ధ్యం మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకుంటామని అలాగే టాయిలెట్స్, నీటి వసతి, డ్రైన్ వంటి వాటికోసం విద్యాశాఖా మంత్రితో చర్చించి ప్రత్యేక నిధులను తీసుకుని వచ్చి అభివృద్ధి చేసేదిశగా కృషి చేస్తానని తెలిపారు.