అంగరంగ వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు
పట్టణంలోని వివిధ ప్రాంతాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకుని శుక్రవారంనాడు పట్టణంలోని వివిధ ప్రాంతాలలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి డిగ్రీ కళాశాల వద్ద గల శ్రీకృష్ణ గోశాల నందు గోశాల కమిటీ ఏర్పాటు చేసిన కృష్ణాష్టమి వేడుకలలో పట్టణప్రజలు భారీగా తరలివచ్చి ప్రత్యేకపూజలు నిర్వహించారు.
ఈ వేడుకలలో భాగంగా ఏర్పాటు చేసిన గోగ్రాస తులాభారం, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉట్టికొట్టే కార్యక్రమాలలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు అనంతరం ఈ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేశారు ఈ కార్యక్రమంలో అధికసంఖ్యలో పిల్లలు శ్రీకృష్ణ వేషధారణతో ఒకేచోట ఉండడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది . అలాగే పలు ప్రైవేటు పాఠశాలలలో శ్రీకృష్ణ వేషధారణ ధరించిన పిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.