పొదిలి నగర పంచాయతీలో ఐదు పంచాయతీల విలీనానికి రంగం సిద్ధం
పావులు కదుపుతున్న శాసనసభ్యాలు కుందూరు
పొదిలి నగర పంచాయతీలో ఐదు పంచాయతీలను విలీనం చేసేందుకు రంగం సిద్ధమైంది.
వివరాల్లోకి వెళితే నందిపాలెం, మాదాలవారి పాలెం, కంభాలపాడు, జువ్వలేరు, మల్లవరం గ్రామ పంచాయతీలను కలిపేదిశగా రంగం సిద్ధమైంది.
వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 50పంచాయతీలను నగర పంచాయతీలుగా మార్పుకు శ్రీకారం చుట్టిన విషయం విదితమే…. అందులో భాగంగా ప్రస్తుత మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న పొదిలి గ్రామ పంచాయతీని నగర పంచాయతీగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం పొదిలికి ఉన్న సౌకర్యాలు, ప్రభుత్వ ఆస్తులు, జనాభా గ్రామ పంచాయతీ గురించిన పూర్తిస్థాయి నివేదికను ఆగష్టు 5వ తేదీలోగా సచివాలయానికి చేరే విధంగా చర్యలు తీసుకోవాలనే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు మేరకు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా పంచాయతీ అధికారి పొదిలి గ్రామ పంచాయతీ గురించిన పూర్తి నివేదికను అందించాలని గ్రామ పంచాయతీ కార్యాలయానికి ఉత్తర్వులు జారీచేయగా….. పంచాయతీ అధికారులు తగు నివేదికను తయారుచేసి పంపించారు.
అయితే ప్రస్తుతం గ్రామ పంచాయతీ నగర పంచాయతీ కానున్న నేపథ్యంలో మొట్టమొదటి నగరపంచాయతీ స్థానాన్ని కైవసం చేసుకునే దిశగా మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి వైకాపా ముఖ్య నాయకులు, అనుచరులతో సమావేశమై నగర పంచాయతీపై పూర్తి స్థాయిలో పట్టు సాధించాలంటే కావలసిన కార్యాచరణ గురించి చర్చలు జరపగా……
వైసీపీ పట్టున్న నాలుగైదు పంచాయతీలను పొదిలి నగర పంచాయతీలో విలీనం చేస్తే మనకు పూర్తి పట్టు లభిస్తుందని ఏకాభిప్రాయానికి రావడంతో…… యుద్ధప్రాతిపదికన కుందూరు నాగార్జునరెడ్డి తనదైన శైలిలో పావులుకదిపి నందిపాలెం, మాదాలవారి పాలెం, కంభాలపాడు, జువ్వలేరు, మల్లవరం ఐదు గ్రామ పంచాయతీలను పొదిలి నగర పంచాయతీలో విలీనంచేసే దిశగా పనులు ప్రారంభించి సంబంధించిన పూర్తి దస్త్రాలను తయారు చేయించి పంపినట్లు విశ్వసనీయ సమాచారం