మోడీ చిత్రాలతో చీరకట్టు…. మోడీని ఆకర్షించిన ప్రవాస భారతీయురాలు

భారత ప్రధాని నరేంద్రమోడీ ఫ్రాన్స్ పర్యటన అనంతరం ఆదివారంనాడు బెహ్రెయిన్ చేరుకున్నారు. ప్రస్తుతం బెహ్రెయిన్ లో జరుగుతున్న జి7 (గ్రూప్ ఆఫ్ సెవెన్) దేశాల సమావేశంలో పాల్గొన్నారు.

అనంతరం బెహ్రెయిన్ లోని శ్రీనాథ్ జి ఆలయంలో ప్రవాస భారతీయులతో సమావేశమై ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ఓ భారతీయ మహిళ మోడీ చిత్రాలతో ప్రత్యేకంగా తయారు చేసిన చీరను ధరించి కార్యక్రమంలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.