రోగులకు పండ్లు, బ్రెడ్లు, నగదు పంపిణీ చేసిన “రోటీ” సోదరులు
స్థానిక ప్రభుత్వ సామాజిక వైద్యశాల నందు రోటీ సోదరులు రోగులకు పండ్లు, బ్రెడ్లు, నగదు పంపిణీ చేశారు.
వివరాల్లోకి వెళితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం జిల్లా కార్యదర్శి రోటీ రబ్బానీ కుమారుడు షాహుల్ పుట్టినరోజు సందర్భంగా తన సోదరులు, కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి ప్రభుత్వ వైద్యశాలలోని రోగులకు పండ్లు, బ్రెడ్లు, నగదును పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా రోటీ సోదరులు మాట్లాడుతూ షాహుల్ పుట్టినరోజు వేడుకలలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని….. కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు చేసుకోవడంలోనే కాకుండా ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ వైద్యులు డాక్టర్ చక్రవర్తికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రోటీ సోదరులు, కుటుంబ సభ్యులు, ప్రభుత్వ వైద్యులు డాక్టర్ చక్రవర్తి, మిత్రులు తదితరులు పాల్గొన్నారు.