30న నూతన తహశీల్దార్ భవనం ప్రారంభం

పొదిలి మండలం రెవెన్యూ తహశీల్దార్ కార్యాలయం నూతన భవనం ఈ నెల 30వ తేదీ శుక్రవారం ప్రారంభం జరుగుతుందని తహశీల్దార్ భవన నిర్మాణ కాంట్రాక్టర్ తూము బాలిరెడ్డి తెలిపారు.

వివరాల్లోకి వెళితే 90లక్షల అంచనా వ్యయం కలిగిన పనులకు 12శాతం తక్కువగా సుమారు 70లక్షల రూపాయలకు టెండర్ దక్కించుకుని పనులు పూర్తి చేశానని కాంట్రాక్టర్ తూము బాలిరెడ్డి తెలిపారు. నూతన భవన ప్రారంభోత్సవానికి జిల్లా కలెక్టర్, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనువాసులరెడ్డి, శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి మరియు జిల్లా స్ధాయి అధికారులు తదితరులు పాల్గొననున్నారని ఆయన తెలిపారు.