బొలెరో వాహనం ఢీకొని ఇద్దరికి గాయాలు

మండలంలోని సలకనూతల గ్రామం వద్ద బొలెరో వాహనం ఢీకొనడంతో ఇద్దరికి గాయాలైన సంఘటన గురువారంనాడు చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే సలకనూతల గ్రామం వద్ద పొదిలి – మార్కాపురం రోడ్డు పక్కనే బస్టాప్ నందు గల అరుగు వద్ద ద్విచక్రవాహనం నిలిపి మాట్లాడుకుంటూ ఉండగా పొదిలి వైపు నుండి మార్కాపురం వైపు వెళ్తున్న బొలెరో వాహనం ఢీకొనడంతో రాజు, తిరుపతమ్మలు గాయపడ్డారు. గాయపడిన వారిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించి రాజుకు కుడికాలుకు గాయం కాగా మెరుగైన వైద్యంకోసం ఒంగోలు తరలించినట్లు సమాచారం. కాగా ప్రమాదానికి కారణమైన బొలెరో వాహనానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.