14 సెంటర్లలో 4127మందికి గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్ష
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని తలపెట్టిన గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్ష రేపటి నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా అదనపు కలెక్టర్ జి సూరజ్ శనివారంనాడు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.
గ్రామ సచివాలయ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు కావడంతో రాష్ట్రంలోని నిరుద్యోగులు లక్షల సంఖ్యలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగా…. సెప్టెంబర్ 1నుండి 9వరకు పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో రాష్ట్రంలో పరీక్షా కేంద్రాలైన ప్రతి ఒక్క పరీక్షా కేంద్రంలో కూడా ఎటువంటి అవకతవకలకు తావులేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఇందులో భాగంగా జిల్లా అదనపు కలెక్టర్ పొదిలి మండలంలోని 14పరీక్షా కేంద్రాలను పరిశీలించి…. పరీక్షలకు హాజరయ్యే 4127మందికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని….. ఎంతో పగడ్బంధీగా పరీక్షలు నిర్వహించేందుకు గాను ప్రతిఒక్క పరీక్షా కేంద్రంలో కెమెరాల సహాయంతో జిల్లా యంత్రాంగం పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకున్నామని….. అదేవిధంగా పరీక్షలలో భాగంగా విధులు నిర్వహిస్తున్న వారు ఏవైనా అవకతవకలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల రెవిన్యూ తహశీల్దార్ ప్రభాకరరావు, మండల విద్యాశాఖ అధికారి రఘురామయ్య, ఈఓఆర్డి రాజశేఖర్, ఆర్ఐ సుబ్బారాయుడు, తదితరులు పాల్గొన్నారు.