అస్సాంలో 19లక్షల మంది విదేశీయులు ఉన్నట్లు జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్సీ) నిర్ధారణ

మరో 50లక్షలకుపైగా ఉన్నారంటూ ఆరోపిస్తున్న ఏజిపి

వారిలో హిందువులకు మాత్రమే పౌరసత్వం ఇచ్చేందుకే మోడీ మరో రాజ్యాంగ సవరణకు సిద్ధంగా ఉన్నట్లు ఆరోపిస్తున్న ఎంఐఎం ఛీఫ్ అసదుద్దిన్ ఓవైసి

జాతీయ పౌర రిజిస్టార్ లో తన పేరు లేదని మహిళ ఆత్మహత్య

అస్సాంలో తీవ్ర ఉద్రికత్త భారీగా బలగాలు మోహరింపు

భారత సుప్రీంకోర్టు పర్యవేక్షణలో తయారైన జాతీయ పౌర రిజిస్ట్రార్ (ఎన్ఆర్సీ)ను ఆగష్టు 31శనివారంనాడు విడుదల చేయగా…. అందులో 3కోట్ల 11లక్షల 21వేల 4మందిని భారత పౌరలుగా గుర్తించగా…. 19లక్షల 6వేల 657మందిని గుర్తించినట్లు అస్సాం రాజధాని గౌహాతిలోని జాతీయ పౌర రిజిస్ట్రార్ (ఎన్ఆర్సీ) కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.

వివరాల్లోకి వెళితే బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చి అస్సాంలోని సంపద దోచుకుంటున్నారని…. వారిని వెంటనే అస్సాం నుండి తరిమి వేయాలని కోరుతూ దశాబ్దాల నుండి ఉద్యమాలు చేస్తు తరుచూ స్ధానికులకు బంగ్లాదేశ్ అక్రమ చొరబాటుదారులకు మధ్య ఘర్షణలు జరగడం పరిపాటిగా మారిన నేపథ్యంలో ఈ అంశంపై సుప్రీంకోర్టు 2013లో సుప్రీంకోర్టుకు వెళ్లడంతో సుప్రీంకోర్టు ఆదేశాలు మేరకు
జాతీయ పౌర రిజిస్ట్రార్ సంస్థ ద్వారా భారత పౌరులను గుర్తించాలని ఆదేశాలు జారీ చేయడంతో శనివారంనాడు జాబితాను ఎన్ఆర్సీ ప్రకటించింది.

ప్రచురించిన జాబితాను అస్సాం గణ పరిషత్ పార్టీ ఛీఫ్ అతుల్ బోరా తీవ్రంగా వ్యతిరేకరించారు. మా అంచనాల ప్రకారం 50లక్షల మందికి పైగా ఉన్నారని కేవలం 19లక్షల మంది మాత్రమే అక్రమ వలసదారులుగా ప్రకటించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ మరోసారి లెక్కింపు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

జాతీయ పౌర రిజిస్ట్రార్ లో నమోదు కాని 19లక్షల మంది అక్రమ వలసదారులలో హిందువులకు మాత్రమే పౌరసత్వం ఇవ్వడంకోసం భారత ప్రధాని నరేంద్ర మోడీ మరో రాజ్యాంగ సవరణ దిశగా పావులు కదుపుతన్నారని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

జాతీయ పౌర రిజిస్ట్రార్ లో పేరు లేకపోవడంతో మనస్ధాపం చెందిన ఒక మహిళ ఆత్మహత్యకు పాల్పడడంతో అస్సాంలో తీవ్ర ఉద్రికత్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. కాగా ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా భారత ప్రభుత్వం భారీగా బలగాలను మోహరించింది.