స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ కు ఘనంగా నివాళులర్పించిన వైసీపీ శ్రేణులు

స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 10వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు.

వివరాల్లోకి వెళితే స్థానిక విశ్వానాథపురం సెంటర్ లోని వైఎస్ఆర్ విగ్రహానికి మాజీ శాసనసభ్యులు ఉడుముల శ్రీనివాసులురెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామ పంచాయతీ మాజీ వార్డు సభ్యులు నూర్జహాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సాయి రాజేశ్వరరావు, వైసీపీ జిల్లా నాయకులు వాకా వెంకటరెడ్డి, గొలమారి చెన్నారెడ్డి, మండల కన్వీనర్ గుజ్జుల సంజీవరెడ్డి, జి శ్రీనివాసులు, కళ్ళం సుబ్బారెడ్డి, మహిళా నాయకురాలు గౌసియా, కోగర వెంకట్రావు యాదవ్, వర్షం ఫిరోజ్, షేక్ రబ్బానీ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.